
H5TV : దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న మీ కల ఇవాళ నిజం కాబోతుంది
ఇవాళ నియామక పత్రాలు అందుకోబోతున్న 922 మందికి, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు
చిన్నదైనా, పెద్దదైనా మొదటి అవకాశం జీవిత కాలం గుర్తుంటుంది
ఇది మీ జీవితకాలం గుర్తుండిపోతుందని నేను భావిస్తున్నా
మీ కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా మీకు రావాల్సిన ఉద్యోగాలు ఇవి
గత పాలకులు పదేళ్లుగా ఈ నియామకాలను పట్టించుకోలేదంటే.. ఎంత నిర్లక్ష్యం వహించిందో ఆలోచించండి..
అలాంటి నిర్లక్ష్యం ప్రజా ప్రభుత్వంలో ఉండకూడదనే ఈ నియామకాలు పూర్తి చేస్తున్నాం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జీవితాలు బాగుపడతాయని నిరుద్యోగ యువత పోరాడింది
రాష్ట్రం ఏర్పడినా తెలంగాణ కోసం అమరులైనవారి ఆశయాలు నెరవేరలేదు
మేం అధికారంలో రాగానే 57, 924 ప్రభుత్వ ఉద్యోగాలను ప్రజా ప్రభుత్వంలో భర్తీ చేశాం
కానీ తామే నోటిఫికేషన్లు వేశామని, మేం చేసింది ఏం లేదని కొందరు మాట్లాడుతున్నారు
పదేళ్లు పరీక్షలు నిర్వహించకపోతే నిరుద్యోగుల జీవితాలు ఆగమైన పరిస్థితి మీకు కనిపించలేదా?
మీ ఇంటి బిడ్డలకు పదవి పోతే ఇంకో పదవి ఇచ్చుకున్న మీకు… తెలంగాణలో ఈ పేదింటి బిడ్డల బాధ కనిపించలేదా?
పేదింటి బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన ఎందుకు చేయలేదు?
పది నెలల్లో మేం చేసిన పని… పదేళ్లలో మీరెందుకు చేయలేకపోయారు?
కేవలం పది నెలల్లో 57, 924 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు
గ్రూప్ 1, 2, 3 లలో 2వేల పైచిలుకు ఉద్యోగాలకు మరి కొన్ని రోజుల్లో నియామక పత్రాలు అందించబోతున్నాం
తాము చేయలేదు కాబట్టి మమ్మల్ని చేయనీయకూడదనే ధోరణిలో బీఆరెస్ తీరు ఉంది
అందుకే మా కాళ్లల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు
ఆనాడు ఒక వ్యక్తి, ఒక పార్టీ సెంట్రిక్ గా నిర్ణయాలు జరిగితే.. ఇవాళ ప్రజాభీష్టం మేరకు నిర్ణయాలు జరుగుతున్నాయి
హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలు అరికట్టేందుకే బిల్డ్ నౌ పోర్టల్ ను తీసుకొచ్చాం
ఎంతటివారైనా సరే ఆన్లైన్ లో అనుమతులు తీసుకోవాల్సిందే
ప్రజలకు పారదర్శక పరిపాలన అందించడమే మా ఉద్దేశం.. అదే
గుడ్ గవర్నెన్స్.. ఇది తెలంగాణ మోడల్
ప్రజలు మాపై కోపంగా ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారు
నిరుద్యోగులకు ఉద్యోగ నియామకపత్రాలు అందిస్తున్నందుకు నాపై కోపంగా ఉన్నారా?
అదానీ, అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలకు సోలార్ ఉత్పత్తి చేసే అవకాశం కల్పించినందుకు నాపై కోపం ఉంటుందా?
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినందుకా?
పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నందుకా?
ఎందుకు మాపై కోపంగా ఉంటారు?
రేవంత్ రెడ్డికి పట్టు రాలేదని మాట్లాడుతున్నారు…
రాజయ్య, ఈటెల లాంటి బలహీనవర్గాలను సస్పెండ్ చేస్తేనే పట్టు వచ్చినట్టా…
మేం గడీలలో పెరగకపోవచ్చు… కానీ నల్లమల అడవుల్లో పేదలను చూస్తూ పెరిగాం…
అందుకే మాకు మానవత్వం ఉంది.. మీకు మానవత్వం లేదు
ముఖ్యమంత్రికి విజ్ఞత ఉండాలి…
మేం విజ్ఞతను ప్రదర్శిస్తున్నాం