పిహెచ్ డి విద్యార్థికి ఆర్థిక సహాయం చేసిన హెల్పింగ్ హాండ్స్ ఉద్యోగులు

కామారెడ్డి జిల్లాకు చెందిన లోనే క్రాంతిరాజ్ అను పి.హెచ్.డి. విద్యార్ధి ఇంటి ఆర్థికపరిస్థితుల వలన యూనివర్సిటీ ఫీజు బకాయిలతో పాటు అంతిమ పరీక్ష ఫీజు కూడా చెల్లించలేని స్థితిలో ఉండడం వలన, డాక్టరేట్ పట్టా పొంది, తన ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఆర్థికసహాయం కోసం ఎదురుచూస్తున్న ఆ పరిశోధన విద్యార్థికి, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రో. కాశిమ్ సర్ చేతుల మీదుగా తెలంగాణ ఎస్సి & ఎస్టీ ఎంప్లాయిస్ హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ తరపున అధ్యక్షులు శ్రీ గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ జె.దేవేందర్ ప్రేమ్ చెక్కు రూపంలో Rs.25,000/- ఆర్థిక సహాయంను అందించడం జరిగింది. ప్రిన్సిపాల్ ప్రో. కాశిమ్ సర్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు అత్యవసరమైన సమయంలో ఆర్థిక సహాయం చేస్తూ, ఆపన్నహస్తం అందిస్తున్న హెల్పింగ్ హాండ్స్
అసోసియేషన్ యొక్క పే బ్యాక్ టు సొసైటీ సేవలను మెచ్చుకొంటూ, ప్రతి ఒక్కరు వీరిలాగా పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రో. రామేశ్వర్ రావ్, భీం రాజ్ మొదలగు హెల్పింగ్ హాండ్స్ సభ్యులతో పాటుగా ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగులు
ప్రో. కే.అరుణ్, ప్రో. రామకృష్ణ
శ్రీ కే.శంకర్ మాంగ్, శ్రీ కళ్యాణ్ తో పాటుగా వివిధ విద్యార్ధి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *