ఐటీ ఉద్యోగుల కోసం డైలీ షటిల్స్ ప్రారంభం

హైదరాబాద్‌లో “డైలీ షటిల్స్” సేవలకు ఘన ప్రారంభం
ఐటీ ఉద్యోగుల రోజువారీ ప్రయాణాన్ని సులభతరం చేసే వినూత్న రవాణా సేవ

హైదరాబాద్, జూలై 7: నగరంలో ఐటీ కంపెనీల ఉద్యోగుల రోజువారీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా, సమయపాలనతో అందించేందుకు SMAAT Daily Shuttles Services Private Limited ఆధ్వర్యంలో ప్రారంభించిన “Daily Shuttles” సేవలను మంగళవారం హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్లో ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ హాజరై సేవలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ శ్రీ మధు యాష్కీ గౌడ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రవాణా, రోడ్లు & భవనాల శాఖ) శ్రీ వికాస్ రాజ్, IAS, తెలంగాణ రవాణా కమిషనర్ శ్రీ కె. ఇలంబరితి, IAS, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. రమేష్, IPS, అదనపు రవాణా కమిషనర్ శ్రీ సి. రమేష్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, డైలీ షటిల్స్ ద్వారా హైదరాబాద్‌లోని వివిధ ఐటీ కారిడార్లకు ఉద్యోగులు ప్రతిరోజూ సౌకర్యవంతంగా, సమయానికి, ట్రాఫిక్ ఒత్తిడి లేకుండా ప్రయాణించేలా ప్రత్యేక బస్సు సేవలను అందిస్తున్నామని తెలిపారు. ఈ సేవల ద్వారా వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గడంతో పాటు ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

అత్యాధునిక సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు, సమయపాలన, సౌకర్యవంతమైన సీటింగ్, డిజిటల్ బుకింగ్ వంటి ప్రత్యేకతలతో ఉద్యోగులకు నాణ్యమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

పర్యావరణ హితమైన, స్మార్ట్ నగర రవాణా వ్యవస్థ అభివృద్ధికి డైలీ షటిల్స్ ఒక కొత్త అడుగుగా నిలుస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

H5TV News Portal

For more queries or ads, reach out to us

📧
connecth5tv@gmail.com
📞
+91 9502573071